దేశం గర్వించే స్థాయికి ఎదిగిన తెలంగాణ పోలీస్​: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

by Nagaya |
దేశం గర్వించే స్థాయికి ఎదిగిన తెలంగాణ పోలీస్​: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, బడంగ్​పేట్ : దేశంలోనే తెలంగాణ పోలీస్​ గర్వించే స్థాయికి ఎదిగిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దేశంలోనే హైదరాబాద్​అత్యంత సురక్షితమైన సిటీగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డ్రగ్స్, షీ టీంలపై గురువారం జరిగిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందన్నారు. విద్యార్థి దశలో ఇంటర్ విద్య అత్యంత కీలకమన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. చెడు వ్యసనాల భారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవదన్నారు.

తెలంగాణ రహిత డ్రగ్స్​ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ నేపథ్యంలో చదివే విద్యార్థులకు పైచదువుల్లో ఎదురయ్యే ఇబ్బందులు అధిగమించాటానికి ఇంగ్లిష్ మీడియంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రపంచంతో తెలంగాణ విద్యార్థి పోటీ పడేలా తయారు కావలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. గతంలో అమ్మాయిల విద్యకు తల్లిదండ్రులు వెనకడుగు వేసేవారని, నేడు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సహంతో బాలికల అక్షరాస్యత శాతం పెరిగిందన్నారు. ఉన్నత చదువులు చదువుతున్న వారిలో యూనివర్సిటీలలో అమ్మాయిలు 60 నుండి 70 శాతం వరకు ఉన్నారని, గణనీయంగా పెరుగుతున్న బాలికల శాతం దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ యూనివర్సిటీ కి ఆమోదం తెలిపారన్నారు.



మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు అలవాటు పడి వారి జీవితాలను పాడుచేసుకుంటున్నారు. సరదాగా మొదలైన ఈ అలవాటు నేరాలు గోరాలు, హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదని, ముఖ్యంగా మన తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా, డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్​ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ మల్కాజిగిరి ఉమెన్స్ ఫోరమ్ రక్షిత మూర్తి , డీసీపీ షీ టీమ్స్ రాచకొండ సలీమ, ఆర్​కె ఎస్​సి ప్రధాన కార్యదర్శి సతీష్ , ఆర్​కె ఎస్​సి ఉమెన్స్ జాయింట్ సెక్రటరీ లత రామసుబ్రహ్మణ్యం, ఏసీపీ సైబర్ క్రైమ్స్ రాచకొండ హరినాథ్, అమృత ఫౌండేషన్ దేవిక, టీకేఆర్​ఇంజనీరింగ్ కళాశాల కార్యదర్శి తీగల హరినాథ్ రెడ్డి, కోశాధికారి తీగల అమర్ నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story