Acharya| Telangana: 'ఆచార్య'కు తెలంగాణ సర్కార్‌ శుభవార్త

by GSrikanth |   ( Updated:2022-04-25 12:09:24.0  )
Acharya| Telangana: ఆచార్యకు తెలంగాణ సర్కార్‌ శుభవార్త
X

Acharya| Telangana

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన ఆచార్య చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న 'ఆచార్య' టీమ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో సినిమా టికెట్లు రేట్లు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక, సినిమా విడుదలైన తొలి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఐదో షో వేసుకునేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ ప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50, సాధారణ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.30 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్‌ను ఫుల్ జోష్‌లో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.

Advertisement

Next Story