జగన్ మూడేళ్లుగా మడమ తిప్పారు: టీడీపీ నేత

by Manoj |
జగన్ మూడేళ్లుగా మడమ తిప్పారు: టీడీపీ నేత
X

దిశ, ఏపీ బ్యూరో: ఏటా డీఎస్సీ నిర్వహిస్తానని మాట ఇచ్చిన జగన్ మూడేళ్లుగా మాట తప్పి మడమ తిప్పారని టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 20 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయకుండా 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం దారుణమన్నారు. నిరుద్యోగుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు లాఠీ‌చార్జి చేయించారని ఆరోపించారు. పాఠశాలల విలీనం పేరుతో మరిన్ని పోస్టులను రద్దు చేసేందుకు కుట్ర పన్నారన్నారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్‌ను రద్దు చేసి విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story