- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా, ఉక్రెయిన్: యుద్ధం ఆపాలంటే ఆమె ఒక్కదాని వల్లే అవుతుంది..!
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య బీకర యుద్ధం సాగుతోన్న వేళ.. స్విట్జర్లాండ్‌లో మరో కొత్త ఉద్యమం తెరమీదకు వచ్చింది. స్విస్ ప్రజలు ఓ మహిళను తమ దేశం నుండి బహిష్కరించాలంటూ ఆందోళన చేస్తు్న్నారు. అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ఆ మహిళకు ఏంటి సంబంధం అంటే.. ఆమె మరెవరో కాదు పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ వరల్డ్ ఛాంపియన్ అలీనా కబయేవా. అయితే, రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభానికి ముందే ప్రేయసి అలీనాను స్విట్జర్లాండ్‌కు తరలించి.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓ విల్లాలో ఆమెను ఉంచినట్లు వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనితో స్విస్ ప్రజలు కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అలీనా చెబుతే పుతిన్ వింటాడని.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ఆపాలంటే కేవలం అలీనా వల్లే అవుతుందని.. కావున తిరిగి ఆమెను స్విస్ నుండి రష్యాకు పంపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆమెను తిరిగి పంపేందుకు వారు చేంజ్ డాట్ ఆర్గ్ అనే వైబ్ సైట్ లో పిటిషన్ దాఖలు చేయగా.. వీరికి మద్దతుగా ఇప్పటివరకు 50వేల మంది ఉక్రెయిన్,రష్యా, బెలారస్ పౌరులు సంతకాలు చేశారు. రోజుకు రోజుకు ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేస్తోన్న రష్యాపై.. ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్న పుతిన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. యుఎన్‌వో, అంతర్జాతీయ న్యాయస్థానం మాటలను సైతం పుతిన్ పట్టించుకోవడం లేదు. దీనితో ప్రేయసి అలీనా చెబుతే అయినా పుతిన్ వింటాడని ఆమెను రష్యాకు పంపి ఆ ప్రయత్నాలు చేయాలని స్వి్స్ ప్రజలు డిమాండ్ చేస్తు్న్నారు. కాగా, పాశ్చాత్య దేశాలు అలీనా కబయేవా, పుతిన్‌కు మూడో ప్రేయసిగా భావిస్తున్నాయి.