IPL 2022 : అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా రెండో విజయం

by Mahesh |   ( Updated:2022-04-12 03:38:04.0  )
IPL 2022 : అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా రెండో విజయం
X

ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్ సీజన్ -15లో ఎంట్రీ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచుల్లో ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఆటగాళ్లు ఫామ్‌లోకి వస్తుండటంతో వరుసగా హైదరాబాద్ జట్టు రెండో విజయాన్ని అందుకుంది. ఈసారి ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ జట్టు కూర్పుపై పెద్దఎత్తున విమర్శలు తలెత్తాయి. ఆటగాళ్లు సోసోగా ఆడుతుండడం పై అభిమానులు ఎంతో నిరుత్సాహానికి లోనయ్యారు. తాజా మ్యాచులో గుజరాత్ టైటాన్స్‌పై సన్ రైజర్స్ విజయం సాధించడంతో అటు ఫ్యాన్స్‌తో సహా ఇటు జట్టు యాజమాన్యం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది.

ముంబై : ఐపీఎల్ 15 సీజన్‌లో దిగ్గజ సీనియర్ జట్లు చేతులెత్తేశాయి. వరుసగా రెండు ఓటములను చవిచూడటంతో సన్ రైజర్స్‌ పని కూడా అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా హైదరాబాద్ జట్టు పడిలేచి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది. తొలి రెండు మ్యాచులు ఓడిపోయిన మూడు, నాలుగో మ్యాచ్ గెలిచి జట్టు పై నమ్మకాన్ని పెంచాయి. సోమవారం డీవై పాటిల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు సమిష్టిగా రాణించి 19.1 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

విలియమ్ సన్ కెప్టెన్ ఇన్నింగ్స్..

సన్ రైజర్స్ జట్టు టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణించడంతో లక్ష్య ఛేదనలో హైదరాబాద్ పెద్దగా చెమటోడ్చలేదని చెప్పవచ్చు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ 42/32, కెప్టెన్ కేన్ విలియమ్ సన్ 57/46, రాహుల్ త్రిపాఠి 17/11, నికోలస్ పూరన్ 34/18, మార్కరమ్ 12/8 అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా కెప్టెన్ విలియమ్ సన్ జట్టు భారాన్ని తన భుజాలపై మోసాడనంలో అతిశయోక్తి లేదు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా హైదరాబాద్ సూపర్‌గా రాణించింది. భువనేశ్వర్ కుమార్ 37/2, నటరాజన్ 34/2 వికెట్లతో గుజరాత్ జట్టు బలమైన భాగస్వామ్యాన్ని విడగొట్టారు.

గుజరాత్ విజయాలకు కళ్ళెం..

వరుసగా విజయాలతో దూకుడు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టును హైదరాబాద్ కళ్లెం వేసింది. ఈ సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన టైటాన్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రాకెట్‌లా దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న గుజరాత్‌కు విలియమ్సన్ సేన తొలిసారిగా ఓటమిని రుచి చూపించింది. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్సింగ్స్ 50/40 ఆడి జట్టును విజయతీరాలకు చేర్చేందుకు ఎంతో ప్రయత్నించినా ఫలితం చేజారింది. టైటాన్స్ జట్టులో వేడ్ 19/19, మిల్లర్ 12/15, మనోహర్ 35/21, సుదర్శన్ 11/9 మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. గుజరాత్ బౌలింగ్ విభాగం బలంగా ఉన్న సన్‌రైజర్స్ డాషింగ్ బ్యాటింగ్‌ ముందు వారు తేలిపోవడంతో టైటాన్స్ జట్టుకు ఓటమి తప్పలేదు.

స్కోర్ బోర్డు :

గుజరాత్ టైటాన్స్ : 162/7(20)

ఇన్నింగ్స్ : మాథ్యూ వేడ్ 19 (బి) ఉమ్రాన్ మాలిక్, శుభ్ మన్ గిల్ 7 (బి) భువనేశ్వర్, సాయి సుదర్శన్ 11(బి) నటరాజన్, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, మిల్లర్ 12 (బి) మార్కో జాన్సెన్, అభినవ్ మనోహర్ 35(బి)భువనేశ్వర్, రాహుల్ తెవాటియా 6(ఆర్)పూరన్/ నటరాజన్, రషీద్ ఖాన్ 0 (బి) నటరాజన్

వికెట్ల పతనం : 24-1,47-2,64-3,104-4,154-5,161-6,162-7

బౌలింగ్ : భువనేశ్వర్ (4-0-37-2), మార్కో జాన్సెన్ (4-0-27-1) వాషింగ్టన్ సుందర్ (3-0-14-0), నటరాజన్ (4-0-39-1), ఉమ్రాన్ మాలిక్ (4-0-39-1) మార్కమ్ (1-0-9-0)

సన్ రైజర్స్ హైదరాబాద్ 168/2(19.1)

ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ 42 (బి) రషీద్ ఖాన్, కేన్ విలియమ్ సన్ 57 (బి) హార్దిక్ పాండ్యా, రాహుల్ త్రిపాఠి 17(రిటైర్ట్ హర్ట్), నికోలస్ పూరన్ 34 నాటౌట్, మార్క్రమ్ 12 నాటౌట్

వికెట్ల పతనం :64-1,129-2

బౌలింగ్ : మహమ్మద్ షమీ (4-0-31-0),హార్దిక్ పాండ్యా (4-0-27-1), ఫెర్గూసన్ (4-0-46-0),రషీద్ ఖాన్ (4-0-28-1), దర్శన్ నల్కండే (2.1-0-22-0), రాహుల్ తెవాటియా (1-0-10-0)

Advertisement

Next Story