కారు ప్రమాదంలో గాయాలపాలైన స్టార్ హీరోయిన్

by srinivas |
కారు ప్రమాదంలో గాయాలపాలైన స్టార్ హీరోయిన్
X

దిశ, సినిమా : 'అనదర్ వరల్డ్' టీవీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న హాలీవుడ్‌లో నటి అన్నే హెచే కారు ప్రమాదానికి గురైంది. లాస్ ఏంజిల్స్‌లో నివాసముంటున్న హెచే బయటికెళ్లేందుకు గ్యారేజీ నుంచి కారును బయటకుతీసే క్రమంలో ఓ ఇంటిని ఢీ కొట్టడంతో కారు నుంచి మంటలు చెలరేగి ఆమె అందులో చిక్కుకుపోయింది. గమనించిన స్థానికులు ఆమెను ప్రమాదం నుంచి రక్షించి హస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే ఒంటిపై పలు గాయాలైనట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం తన పరిస్థితి మెరుగ్గా ఉందని, స్పృహలోకి కూడా వచ్చిందని తెలుస్తోంది. కాగా 'డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్' వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story