- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలుడిని కాటేసిన పాము అక్కడికక్కడే మృతి.. ఇంతకూ ఏం జరిగిందంటే..?
దిశ, వెబ్‌డెస్క్: పాములను చూస్తే భయపడనవారు ఉండరు. కొందరికి వాటి పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఇక అది దగ్గరకు వచ్చి కాటేస్తే.. ఆ భయానికే ప్రాణాలు విడుస్తారు. అయితే పాముల్లో అన్నీ విషపూరితమైనవి ఉండవు. కానీ త్రాచు పాములు మాత్రం ప్రమాదకరమైనవే. అవ్వి కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం. కానీ బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. నాగు పాము కాటేసినా ఓ బాలుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆ కాటేసిన పాము మాత్రం క్షణాల్లోనే చనిపోవడం విచిత్రంగా మారింది.
బీహార్‌లోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనూజ్ (4) తన మామ ఇంటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అక్కడ పిల్లలతో ఆడుకుంటుండగా పొలం వైపు నుంచి ఓ విషపూరితమైన నాగు పాము వచ్చి పాదంపై కాటు వేసింది. అయితే అది గమనించిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. ఆ పామును చంపడానికి దాని వెనకాల పరుగులు తీశారు. కానీ, అందరూ పాము వద్దకు చేరుకునేలోపు అది చనిపోయింది. విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. పాము కాటుకు గురైన అనూజ్‌కు ఏమి కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ పాము చనిపోవడం మిస్టరీగా మారింది.