- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ పెళ్లి చేసుకున్న బుల్లితెర జంట.. మెడలో మూడు ముళ్లు వేస్తున్న వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర జంట నిరుపమ్- మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంజుల ‘చంద్రముఖి’ సీరియల్‌తో పాటు పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం అడపా దడపా సీరియల్స్‌లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇక నిరూపమ్ విషయానికి వస్తే ‘కార్తీక దీపం’ సీరియల్‌తో బుల్లితెర స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో డాక్టర్ బాబు పాత్రలో అద్భుతంగా నటించి తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘కార్తీక దీపం 2’ సీరియల్‌లో నటిస్తున్నాడు. ఈ ధారావాహికకు కూడా బుల్లి తెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి. కాగా నిరుపమ్ పరిటాల, మంజులది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్‌లో నటించారు.
అలా ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ తర్వాత అది ప్రేమగా చిగురించింది. ఆ తర్వాత ఇరు పెద్దలు కూడా వీరి ప్రేమను అశీర్వదించడంతో పెళ్లిపీటలెక్కారు. ఇక వీరి ప్రేమకు ప్రతీకగా ఒక కుమారుడు జన్మించాడు. కాగా ఆదివారం (అక్టోబర్ 13) నిరూపమ్, మంజుల పెళ్లి రోజు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే తేదీన ఈ లవ్లీ కపుల్ మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.
అయితే తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిరూపమ్, మంజుల మరోసారి పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిరూపమ్ మరోసారి మంజుల మెడలో మూడుముళ్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు నిరూపమ్ దంపతులు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఈ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
(VIDEO LINK CREDITS TO MANJULA NIRUPAM YOU TUBE CHANNEL)