- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Megastar Chiranjeevi:మెగాస్టార్ ధరించిన ఈ సింపుల్ చెప్పుల ధరెంతో తెలిస్తే ఖంగుతినాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రిని కలిసి కోటి రూపాయల చెక్కు అందించిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకుని.. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగ్గా.. మెగా ఫ్యామిలీ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. కాగా మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. వీరితో పాటుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇలా మొత్తంగా సుమారు 8 కోట్ల రూపాయల వరకు వరద బాధితులకు విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు.
దసరా పండుగ నాడు మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎంను కలిసి తానే స్వయంగా చెక్కు అందించారు. దీంతో చంద్రబాబు నాయుడు మెగాస్టార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే బాబుతో భేటీ అయిన మెగాస్టార్ డ్రెస్సింగ్ స్టైల్, చిరు ధరించిన చెప్పులు హైలెట్‌గా నిలిచాయి. అందరి దృష్టి చిరు డ్రెస్సింగ్ సెన్స్, చెప్పులపై పడగా.. ఆయన తొడుకున్న చెప్పుల ధర ఎంత అని అభిమానులు సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ చెప్పుల ధర ఏకంగా రూ. 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇవి పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్ గూచీ కంపెనీ వారు తయారు చేసినవట. దాదాపు 3000 అమెరికన్ డాలర్లకు పైగానే రేటు ఉంటుందని జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.