Breaking: రష్యాపై ప్రపంచ దేశాల ఆగ్రహం.. పుతిన్‌కు అమెరికా వార్నింగ్

by GSrikanth |
Breaking: రష్యాపై ప్రపంచ దేశాల ఆగ్రహం.. పుతిన్‌కు అమెరికా వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లో చేస్తున్న విధ్వంసం పట్ల ప్రపంచ దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరాయుధులు, పిల్లలు, మహిళలను రష్యా హతమారుస్తోందని మండిపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా చర్చలు ఏమాత్రం సమర్థనీయం కాదని హితవు పలుకుతున్నారు. అంతేగాక, మరిన్ని ఆంక్షలతో రష్యా దుశ్చర్యను కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెలకు ఆంక్షల సెగ తప్పదని అగ్రరాజ్యమైన అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా నాలుగు రష్యా బ్యాంకుల లావాదేవీలపై అమెరికా ఆంక్షలు కఠినతరం చేసింది.

Advertisement

Next Story