- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడీసీసీ బ్యాంకు కుంభకోణం లో ప్రధాన నిందితుడు అరెస్ట్
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోనే బేల మండల కేంద్రంలో గల ఏడీసీసీ బ్యాంకు కుంభకోణం లో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్ లో గల సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. బేలా adcc బ్యాంకులో రూ. 2,85,00,000/- 13న అక్రమంగా ఎలాంటి వోచర్లు లేకుండా డబ్బులు డ్రా చేసినట్లు ఈనెల 13న ఏడీసీసీ బ్యాంక్ ఆదిలాబాద్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గడ్డం శ్రీనివాస్ బేలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. CR No.23/2022 u/s 420, 409 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బ్యాంకు సిబ్బందిని విచారించగా.. స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపత్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడినట్లు విచారణలో తేలిందన్నారు. దొప్తల పిఎసిఎస్, బేల పిఎసిఎస్ సొసైటీల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వోచర్లు, సంబంధిత పత్రాలు లేకుండా బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌ల అనుమతి లేకుండా నమ్మించి వారి పాస్వర్డ్ వాడుకొని, ఫేక్ లోన్ అకౌంట్ లో నిందితుడు శ్రీపత్ కుమార్ భార్య హిమబిందు, మరదలు దివ్య, బావ నారాయణ, అత్త పెంట రాదా అకౌంట్‌లోకి రూ. 2,85,00,000 నగదు బదిలీ చేసినట్లు తెలిపారు. నిందితుడు, సహా ఉద్యోగులు అయినా బండి రమేష్, s ప్రవీణ్, G ప్రవీణ్, రాహుల్, సవిత, ప్రణీత, వేణుగోపాల్ నితిన్, రమేష్‌ల అకౌంట్లలోకి నగదు బదిలీ అయినట్లు గుర్తించి వారి అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేసి రూ. 37,97,419 నగదును ఏడీసీసీ బ్యాంక్‌కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందన్నారు.
నిందితుడు శ్రీపత్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులో సత్యదేవ్ టెక్నాలజీ, పూనం Boutiq, నేహా lalvani, గోపీచంద్, ఇతర బెట్టింగ్ ఏజెన్సీలలో రూ. 1,40,05,106 నగదును బెట్టింగ్ పెట్టి పోగొట్టుకోవడం జరిగిందని తెలిపారు. సహ ఉద్యోగి అయిన బండి రమేష్ రూ. 26,60,000 నగదును జల్సాలకు వాడుకోగా.. ప్రధాన నిందితుడైన శ్రీపత్ తన జల్సాలకు 20,00,00 వాడుకున్నారన్నారు. ఈ సమావేశంలో డీఎస్‌పీ ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, జైనథ్ సిఐ కొల నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, బేల ఎస్ఐ బి కృష్ణ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.