బావిలో పడ్డ చిరుత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Satheesh |   ( Updated:2022-04-08 09:31:31.0  )
బావిలో పడ్డ చిరుత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఏడాది వేస‌వికాలం ప్రారంభంలోనే విపరీతమైనా ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతలకు మనషులే తట్టుకోలేకపోతుంటే.. ఇంకా అడవిలో ఉండే జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే. వేసవి కాలంలో అడవుల్లో నీరు, ఆహారం దొరకకా జంతువులు జనవాసాల్లోకి వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇలా వచ్చేటప్పడు అవి ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ చిరుత పులికి ఇలాంటి ఘటనే ఎదురైంది. నీటి కోసం వచ్చిన చిరుత ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు మూడు గంటల పాటు శ్రమించి చిరుతను కాపాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో దేవల్‌గావ్ రాజా అటవీ రేంజ్ పరిధిలోని జరిగినట్లు సమాచారం.

Advertisement

Next Story