తండ్రి చికిత్సకి ఆస్పత్రికి వెళ్లితే.. కూతురు మృతి!

by Vinod kumar |   ( Updated:2022-03-06 17:28:20.0  )
తండ్రి చికిత్సకి ఆస్పత్రికి వెళ్లితే.. కూతురు మృతి!
X

దిశ, ములుగు: ప్రమాదవశాత్తు హాస్పిటల్ అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని లక్ష్మక్క పల్లి లో గల ఆర్వీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామం ఎనగుర్తి, దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా గ్రామానికి చెందిన ఇస్తరి భానుతేజ కొంత కాలం క్రితం కాలు విరగడంతో కాలుకి రాడ్ బిగించారు. అయితే కాలులో ఉన్న రాడ్ ను తీయడానికి ములుగు మండలం లోని లక్ష్మక్క పల్లి ఆర్విఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం శనివారం అడ్మిట్ అయ్యారు. వీరు భాను తేజ భార్య మమత నాలుగో అంతస్తులో బట్టలు ఆరబెట్టడానికి ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో వెళ్ళింది. ఆమెతో పాటుగా వారి కూతురు ఇస్తరి దీక్షిత (3) పల్లె తో పాటుగా వెళ్ళింది. బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు దీక్షిత కాలుజారి నాలుగో అంతస్తు నుంచి పడి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అదే హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. మృతి చెందింది. తన తండ్రి భానుతేజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Advertisement

Next Story