Ola ఈ-స్కూటర్‌లో మంటలు.. స్పందించిన సీఈవో

by Harish |
Ola ఈ-స్కూటర్‌లో మంటలు.. స్పందించిన సీఈవో
X

దిశ,వెబ్‌డెస్క్: రోడ్‌పై నిలిచివున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్న సంఘటన పూణెలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన భారీ మంటలు, పొగతో కాలిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల విడుదలైన ఓలా ఈ-స్కూటర్‌‌ల భద్రతపై నెటిజన్లు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్ వేదికగా "భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము, ఈ సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని" అన్నారు. అలాగే కస్టమర్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని Ola యాజమాన్యం తెలిపింది.

Advertisement

Next Story