- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త కోరిక మేరకు.. బాలికను గదిలోకి తోసి ఆపై నీచానికి ఒడిగట్టిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: ఆడవారికి కష్టం వస్తే ఆదుకోవాల్సిన సాటి మహిళలే శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. ఓ మహిళపై దాడి జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి, వారే అఘాయిత్యాలను ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే యూపీలో చోటు చేసుకుంది. తన భర్తకు నచ్చిన ఓ మైనర్ బాలికను బలవంతంగా అతని గదిలోకి తోసి ఆపై జరుగుతున్న తతంగాన్ని వీడియో తీసి దుర్మార్గపు చర్యకు పూనుకుంది. తప్పు చేస్తున్న భర్తకు తగిన బుద్ధి చెప్పాల్సింది పోయి అతనికి సపోర్ట్‌గా దారుణానికి ఒడిగట్టడం ప్రతి ఒక్కరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బదౌడ్ అనే గ్రామంలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటోంది. వీరి ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక ఉండేది. ఇరుగుపొరుగు వారు కావడంతో తరచూ ఆ బాలిక వాళ్ల ఇంటికి వెళ్లేది. ఈ క్రమంలోనే భర్త కన్ను బాలికపై పడగా ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. భార్యను సహాయం కోరాడు. అది తప్పు అని చెప్పాల్సిన భార్య అతనికి సహకరించింది. అనంతరం ఆ బాలికను ఇంటికి పిలిచింది. బాలికను మాటల్లో పెట్టి భర్త ఉన్న గదిలోకి తోసింది. అనంతరం ఆమె భర్త..బాలికపై అత్యాచారం చేస్తుండగా.. ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసింది. అంతే కాకుండా అత్యాచారం విషయం బయట పెడితే ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించింది. దాంతో భయపడిన బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే రెండు రోజుల తర్వాత ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అందరికీ తెలిసిపోయింది. దీంతో బాలిక ఇంట్లో వాళ్లు తనని నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దంపతులను అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :