- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లయిన స్టార్ హీరో పై మోజు పడ్డ అలనాటి హీరోయిన్..! ఆయన కోసం ఏకంగా చస్తానని గొడవ..?
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ రాశి(Rashi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మా టీవీలో ప్రసారమయ్యే జానకి కలగనలేదు అనే సీరియల్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ధారావాహికలో అత్త క్యారెక్టర్లో నటించి మెప్పించింది. అయితే ఇప్పుడు రాశికి సంబంధించిన ఒక మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ ఓ పెళ్లయిన స్టార్ హీరో పై ప్రేమ పెంచుకొని పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను అనే పరిస్థితికి వచ్చిందట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరంటే.. దగ్గుబాటి వెంకటేష్.. అవును మీరు విన్నది నిజమే. రాశికి దగ్గుబాటి వెంకటేష్ అంటే చెప్పలేనంత ఇష్టమట. ఇక ఇదే విషయాన్ని రాశి ఆలీతో సరదాగా(Alitho Saradaga) అనే టాక్ షో లో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కి ఇంటర్వ్యూలు ఇచ్చిన సమయంలో బయటపెట్టింది.
రాశి ఆ టాక్ షో లో మాట్లాడుతూ.. నాకు చిన్నతనంలో వెంకటేష్(Venkatesh) అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. ఆయనకి పెళ్లయింది ఆయన పెద్ద హీరో అని తెలిసినా కూడా పెళ్ళంటూ చేసుకుంటే ఆయననే చేసుకుంటాను అని ఇంట్లో భీష్మించుకొని కూర్చున్నాను. అయితే ఈ విషయంలో నా తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా కూడా నేను వినలేదు. ఆ తర్వాత వెంకటేష్‌ని మర్చిపోయి రాజీవ్ గాంధీ(Ragiv Gandhi) మీదికి నా మనసు మళ్లింది. ఆయన ఓ పెద్ద పొలిటిషన్ అనే సంగతి నాకు తెలియదు. కానీ ఓ పేపర్లో ఆయన ఫొటో చూసి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు..పెళ్ళంటూ చేసుకుంటే ఈ అబ్బాయినే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. అయితే ఈ విషయంలో కూడా ఇంట్లో గొడవ గొడవ చేశాను.
ఈ విషయంలో నా తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అయ్యారు. అలా నేను చిన్నతనంలో ఎంతో వెరైటీగా మాట్లాడేదాన్ని. అలాగే నేను సినిమాలో హీరోయిన్గా చేసే సమయంలో కూడా నేను చేసే డైరెక్టర్లతో, నిర్మాతలతో నేను పెళ్లి చేసుకుంటాను ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అని చెప్పే దాన్ని. నా మాటలకు వాళ్ళు కూడా షాక్ అయిపోయేవారు” అంటూ రాశి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తోంది.