అసెంబ్లీ సమావేశాలు షురూ.. మీడియాపై ఆంక్షలు!

by Manoj |   ( Updated:2022-03-07 01:46:26.0  )
అసెంబ్లీ సమావేశాలు షురూ.. మీడియాపై ఆంక్షలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టైమ్‌లో మీడియా ప్రతినిధులపై ఆంక్షలను పెట్టిన అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు ఇప్పుడు కూడా వాటినే కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లోకి ఎంట్రీ లేకుండా జర్నలిస్టులపై ఆంక్షలను అమలుచేస్తున్నారు. కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పెట్టిన ఆంక్షలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగినా ఆంక్షల్లో మాత్రం సడలింపు నిర్ణయాలు తీసుకోలేదు. మీడియా ప్రతినిధులను కేవలం గ్యాలరీలకు, మీడియా పాయింట్‌కు మాత్రమే పరిమితం చేశారు. ప్రత్యేక పాస్‌లను కూడా ఈ ఎంట్రీలకు అనుగుణంగానే రూపొందించారు. ఎమ్మెల్యేలతో లాబీల్లో జర్నలిస్టులకు ఇంటరాక్షన్ లేకుండా పరిమితులు ఏర్పడ్డాయి.

అసెంబ్లీ కార్యక్రమాలను కవర్ చేయడానికి కూడా అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అవకాశం దొరకలేదు. మీడియా సంస్థలకు పరిమిత సంఖ్యలో మాత్రమే తాత్కాలిక పాస్‌లను జారీ చేశారు. విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయని గ్రహించిన హోంశాఖ దాదాపు 1200 మంది పోలీసులను అసెంబ్లీ పరిసరాల్లో మోహరించింది. విద్యార్థి, నిరుద్యోగ, మహిళా, యువజన సంఘాల కార్యకర్తలు వారి వారి డిమాండ్లతో అసెంబ్లీని ముట్టడించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ చుట్టూ పోలీసు వలయాలు ఏర్పడ్డాయి.

Advertisement

Next Story