- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్‌ఎంఈలకు రూ.500 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రభత్వం ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహమిచ్చేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం రూ. 500 కోట్లతో పథకాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా క్లస్టర్లు, MSMEల ఉత్పాదకత, నాణ్యత, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి, మార్కెట్ అవసరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ పథకం పరిష్కరిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యూటికల్ రంగంలో భారత దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం. పథకంలో మూడు 3 భాగాలు ఉంటాయి. సాధారణ సౌకర్యాల కోసం ఔషధ పరిశ్రమ కు సహాయం (APICF), ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ అప్-గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీమ్ (PTUAS), ఫార్మాస్యూటికల్ & వైద్య పరికరాల ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్ (PMPDS). ప్రభుత్వం APICF కోసం ఐదు సంవత్సరాల కాలానికి రూ 178 కోట్లు కేటాయించింది.