ఇంట్లో ఒంటరిగా ఇద్దరు కూతుర్లు.. ఒకరులేని సమయంలో మరొకరిపై తండ్రి అత్యాచారం..

by Satheesh |   ( Updated:2022-03-13 12:37:26.0  )
ఇంట్లో ఒంటరిగా ఇద్దరు కూతుర్లు.. ఒకరులేని సమయంలో మరొకరిపై తండ్రి అత్యాచారం..
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజురోజుకు మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. కామాంధులు ఎంతలా రెచ్చిపోతున్నారంటే తమ కామ కోరికలు తీర్చుకోవడానికి ఆడదైతే చాలు.. అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు కామాంధులు కోరికలకు బలవుతున్నారు. ఇంకొందరైతే వావివరుసలు మరిచి రాక్షసుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. తమ శృంగార కోరికలు తీర్చుకోవడానికి అక్క, చెల్లి, తల్లి, పిల్ల ఇలా ఎవరిని వదలడం లేదు. కంటికి రెప్పలా కాపాడిల్సిన తండ్రే కన్న కూతుర్ల పాలిట శాపంగా మారాడు. తల్లి లేని ఇద్దరు మైనర్ కూతుర్లను బెదిరిస్తూ పదే పదే అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య చనిపోవడంతో.. ఇద్దరు మైనర్ కూతుర్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే, తల్లి లేని ఆ చిన్నారులపై ఆ రాక్షస తండ్రి కన్నేశాడు. తల్లి ప్రేమకు దూరమైన ఆ చిన్నారులకు అన్ని తానే చూసుకోవాల్సిన తండ్రి.. వావివరుసలు మరిచి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి చేసిన పాడు పనిని వారు నిలదీస్తే కత్తితో బెదిరించి పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకరు లేని సమయంలో మరొకరిపై అత్యాచారం చేస్తూ తన కామకోరికలను తీర్చుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతే చంపేస్తానని తండ్రి బెదిరించడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఎట్టకేలకు ఒక ఎన్జీవో వారి సహయంతో ఆ మైనర్ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ కామకాండ తమపై 2019 నుండి జరుగుతున్నట్లు పోలీసులకు చెప్పారు. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రాక్షస తండ్రిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story