రెడ్​క్రాస్​ బ్లడ్​ బ్యాంక్​లో 'హెచ్​ఐవీ.. పోలీసులకు కంప్లైంట్

by Sathputhe Rajesh |
రెడ్​క్రాస్​ బ్లడ్​ బ్యాంక్​లో హెచ్​ఐవీ.. పోలీసులకు కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రెడ్​క్రాస్​ బ్లడ్ ​బ్యాంక్​లో నిత్యం రక్తం ఎక్కించుకుంటున్న ఓ తలసేమియా పేషెంట్​కు హెచ్​ఐవీ సోకింది. గతంలో లేని వైరస్ ​తేలడంతో పేషెంట్​ కుటుంబ సభ్యులు షాక్​కు గురయ్యారు. దీంతో నల్లకుంట పోలీస్​స్టేషన్​లో జూలై 30 న లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ లెటర్ ఆలస్యంగా వెలుగులోకి రావడమే కాక సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్నది. ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్న ప్రకారం ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ''రంగారెడ్డి జిల్లా రాంపల్లి గ్రామానికి చెందిన బి. శివ(27) అనే వ్యక్తికి 2017లో మ్యారేజ్​ అయింది. ఆ తర్వాత ఓ బాబు జన్మించాడు(ప్రస్తుతం 3 ఏళ్లు). అయితే ఆయన పుట్టుకతోనే తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సూచనతో రక్తం ఎక్కించేందుకు సిద్ధమయ్యాం. విద్యానగర్​ నల్లకుంట పరిధిలోని రెడ్​ క్రాస్​ బ్లడ్​బ్యాంక్​ను ఎంపిక చేసుకొని లాస్ట్​ రెండున్నర సంవత్సరాలుగా రక్తం ఎక్కిస్తూనే ఉన్నాం. ప్రతీ పది హేను రోజులకు ఒకసారి బ్లడ్​ ను ఎక్కిస్తున్నాం. గత నెలలో కూడా 20 జూలై 2022న బ్లడ్​ ట్రాన్స్​ప్యూజన్​ చేశాం. ఆ తర్వాత డాక్టర్​ సలహతో బ్లడ్​ టెస్టులు చేస్తే హెచ్​ ఐవీ నిర్ధారణ అయింది. దీంతో నేను నా భార్య రెండు ఆసుపత్రుల్లో చెక్​ చేపిస్తే హెచ్​ ఐవీ నెగెటివ్​ తేలింది. కానీ మా బాబుకు ఆ రెండు ఆసుపత్రుల్లో చేసిన టెస్టు పాజిటివ్​ వచ్చింది. పూర్తి స్థాయి ఎంక్వైరీ తీసుకొని చర్యలు తీసుకోవాలని విన్నపించుకుంటున్నాను"అని ఆ బాలుడు తండ్రి శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.





Advertisement

Next Story

Most Viewed