- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బ్రేకింగ్: రెండు స్థానాల్లో ఓడిపోయిన సీఎం అభ్యర్థి
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాథుల్లో ఉత్సాహం నింపాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేశాయి. మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. ఎన్నికల కౌంటింగ్‌లో అత్యధిక స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో 88 పైగా సీట్లుల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 59 కంటే ఎక్కువ స్థానాల్లో ప్రస్తుతం ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన చన్నీ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీని వీడిన ప్రభావం కాంగ్రెస్ పైన భారీగా పడిందనడంలోనూ ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు సిద్దూ రాజేసిన అసమ్మతి రాజకీయం మొత్తంగా కాంగ్రెస్‌ను పంజాబ్‌లో దెబ్బ తీసింది.