- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిత్ కెప్టెన్సీ వద్దంటున్న ఫ్యాన్స్.. స్టేడియంలో ప్లకార్డు
బెంగళూరు : టీం ఇండియా జట్టు కెప్టెన్సీ పగ్గాలను తిరిగి కోహ్లీకి అప్పగించాలని ఇద్దరు బాల అభిమానులు వినూత్న రీతిలో అభ్యర్థించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంక వర్సెస్ ఇండియా రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా స్టాండ్స్‌లో వీరిద్దరూ ప్లకార్డు ప్రదర్శించారు. "రోహిత్ ఇస్ నాట్ మై కెప్టెన్.. రీఇన్‌స్టేట్ కోహ్లీ'' అని రాసుకొచ్చారు. వీరిద్దరూ విరాట్ అభిమానులుగా తెలుస్తుండగా, రోహిత్‌ను వీరు 'మేక'గా అభివర్ణించారు. ఆదివారం జరిగిన మ్యాచులో ఈ విజువల్స్ హైలెట్ అవ్వగా, కొద్ది సేపటికే వైరల్ కావడంతో అభిమానులు రియాక్ట్ అయ్యారు. ప్లకార్డు ప్రదర్శించిన అభిమానుల తండ్రి దీనిని ట్విట్టర్‌లో పోస్టు చేయగా క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతను శాంతించాలని ఫ్యాన్స్‌ను కోరడంతో పాటు వివరణ ఇచ్చాడు. కోహ్లీని టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని మాత్రమే అభ్యర్థన చేశానని చెప్పాడు.
ఓవర్సీస్ సిరీస్‌లకు ముందు రోహిత్ శర్మ గాయపడగా అతని స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించాడు. అయితే, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లు ఉత్తమ టెస్ట్ కెప్టెన్సీ అభ్యర్థులకు అర్హులు అని సూచించాడు. అదే సమయంలో రోహిత్ అత్యుత్తమ వైట్ బాల్ ప్లేయర్ అని రాసుకొచ్చాడు. 2022 టీ20 ప్రపంచ కప్, 2023 వన్డే ప్రపంచ కప్‌ను భారత్ గెలిచేందుకు 'హిట్‌మ్యాన్' కీలక పాత్ర పోషిస్తాడని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు.