- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైలెంట్ టార్గెట్.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బీజేపీ ఉచ్చు
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. గులాబీ పార్టీని ఇరుకునపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. టీఆర్ఎస్ట్రాప్లో బీజేపీ నేతలు పడకుండా ఉండేలా ఎప్పటికప్పుడు నాయకులకు రాష్ట్ర నాయకత్వం దిశా నిర్దేశం చేస్తోంది. టీఆర్ఎస్నేతలనే తమ లైన్లోకి వచ్చేలా చేయాలని సూచనలు చేస్తోంది. కేంద్రంపై, స్థానిక బీజేపీ నేతలపై టీఆర్ఎస్మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేసినా వాటిని అడ్డగోలు వాదనలకు దిగకుండా నిర్దిష్టమైన కౌంటర్అటాక్స్చేయాలని నిర్ణయించింది. అలా అయితే ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశాలుంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతితో పాటు ప్రజా సమస్యలు, ఉద్యోగాల భర్తీ, వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్నేతలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఈ అంశాలనే ప్రధాన ఎజెండాగా పెట్టుకోనుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలువురిపై రెయిడ్స్జరుగుతున్నా బీజేపీ నేతలు సైలెంట్గా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజలకు దగ్గరయ్యే పనిలో బీజేపీ శ్రేణులు ఉన్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్నేతల అవినీతిపై కూడా స్థానిక నేతలు ఫోకస్చేయాలని నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. గులాబీ శ్రేణుల మైనస్‌లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఇరుకున పెట్టాలని ప్లాన్చేస్తోంది.
ఇప్పటికే కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. హుజురాబాద్ఎన్నికల అనంతంరం సీఎం కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తిరిగి అదే అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు. ఉద్యమం చేపట్టాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు అలాంటి వాదనలకు దిగకుండా ప్రజలకు నిజానిజాలు చెప్పి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ సూచనలు చేస్తోంది. అందుకే ఎమ్మెల్యేల సస్పెన్షన్విషయంలో తీవ్రస్థాయిలో ఆందోళనలకు దిగకుండా సమస్యను ప్రజలకు తెలపాలని మాత్రమే బీజేపీ ప్రయత్నించింది. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ కు కరెంట్కట్చేస్తామని మంత్రి కేటీఆర్వ్యాఖ్యలు చేసినా కౌంటర్అటాక్ఇచ్చి సైలెంట్అయిపోయారు. ఇప్పుడు వరిధాన్యం విషయంలో కూడా కేంద్రం గతంలో చెప్పిన విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించే పనిలో పడ్డారు.