- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్కటైన బి.సి నాయకులు.. కొడంగల్‌లో ఎగిరేది ఆ పార్టీ జెండానే..!
దిశ, కొడంగల్: కొడంగల్ నియోజకవర్గం ఇక్కడ వసతులతో పాటు అక్షరాస్యత తక్కువైన ఇక్కడ ఉండే ప్రజలు ఎన్నికల సమయంలో మాత్రం తెలివి ఉపయోగించి ఓటు వేస్తారు అని చెప్పవచ్చు. గత ఎన్నికల సమయంలో నియోజకవర్గ ఓటర్ల సంఖ్య సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది. ఈ సారి పది వేల నుంచి ఇరవై వేల ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ సామాజిక పరంగా చూస్తే మొత్తం ఓట్ల లో ముదిరాజ్, బీసీ వర్గంతో పాటు దళిత వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ నియోజకవర్గం ఏర్పాటు అయిన ఆరంభంలో ముదిరాజ్, బీసీ సామాజిక వర్గం కొద్దిగా రాజకీయంగా ఎదిగిన రాను రాను ఈ వర్గం నుంచి రాజకీయంగా ఎవరు ఎదగలేదు. వారిని ఎదగనివ్వలేదు అని చెప్పవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే రెడ్డి డామినేషన్ ఎక్కువ అయింది. ఇలాంటి సమయంలో నియోజకవర్గంలో బీసీ మైనారిటీ బహుజన సామాజిక వర్గం నుంచి లేదా కొంత మంది మేదవి సామాజిక వర్గం అని కూడ అంటారు. అలాంటి వారు అంత ఈ మధ్య హైదరాబాద్‌లో రహస్యంగా భేటి అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ రహస్య భేటీ వెనుక ఉన్న సారాంశం ఏమిటంటే ఈ సారి ఎలాగైనా స్థానిక నాయకుడితో పాటు బహుజన సామాజిక వర్గం నుంచి యంఎల్ఎ గా అవకాశం ఇవ్వాలని, దీనికి మొదటగా ఏ రాజకీయ పార్టీ అయినా స్థానికంగా ఉన్న నాయకులకు అవకాశం ఇస్తే వారికి మద్దతు తెలపడం లేదా బహుజన అభ్యర్థిగా ఎవరినైనా నియోజకవర్గంలో పేరున్న వ్యక్తిని అన్ని ప్రధాన పార్టీలకు దీటుగా పోటీలో ఉంచడం, లేదా స్థానిక నాయకుల అవకాశం ఇచ్చిన ఏ పార్టీ అభ్యర్థికీ అయిన సంపూర్ణ మద్దతు తెలపడం ఇలా పలు రకాల ఆలోచనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే కనుక నిజం అయితే ఇప్పుడు ఉన్న యంఎల్ఎ తో పాటు గతంలో ఉన్న యంఎల్ఎ కూడా స్థానికులు కాదు. వీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాబట్టి వీరికి కష్టాలు తప్పడం లేదు అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే రెండు ప్రధాన పార్టీల నుంచి వినిపిస్తున్న మాట ఏమిటి అంటే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి నరేందర్ రెడ్డి కి టికెట్ ఖాయం అని మిగిలిన బీజేపీ, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ,నుంచి ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేకపోయినా అక్కడ అక్కడ జరుగుతున్న ప్రచారం ఏమిటంటే బీజేపీ నుంచి ఈ సారి ఖచ్చితంగా స్థానిక నాయకులకే అది కూడా బహుజన వర్గం నుంచి యువకులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే వైఎస్‌ఆర్‌టీపీ నుంచి కోస్గి మండలంకు చెందిన మరో బీసీ నాయకుడు ఆశతో ఉన్నట్లు సమాచారం. వాస్తవాలకు జనంలో చైతన్యం వచ్చి బహుజన, స్థానిక అంశాలు పరిగణలోకి తీసుకుంటే రెండు ప్రధాన పార్టీలకు కష్ట కాలం అని చెప్పవచ్చు. అదే విధంగా యువత ఓటు కీలకంగా మారనుంది.