ఐక్యారాజ్య స‌మితిలో లైంగిక హింస‌.. సంచ‌ల‌నం రేపిన బిబిసి డాక్యుమెంట‌రీ

by Sumithra |   ( Updated:2023-08-29 05:51:45.0  )
ఐక్యారాజ్య స‌మితిలో లైంగిక హింస‌.. సంచ‌ల‌నం రేపిన బిబిసి డాక్యుమెంట‌రీ
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఐక్య‌రాజ్య స‌మితి అంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక భ‌రోసా అని అనుకుంటారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు ఒక ఆస‌రాగా భావిస్తారు. ముఖ్యంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్త్రీల సాధికార‌త‌, స‌మాన‌త్వం కోసం ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయంగా ఎంతో కృషి చేస్తుంద‌నే పేరుంది. అయితే, పైన ప‌టారం, లోన లొటారంలా ఇప్పుడు యూఎన్ లోప‌ల జ‌రుగుతున్న అస‌లు రంగును ఓ డాక్యుమెంట‌రీ బ‌య‌ట‌పెట్టింది. సహోద్యోగులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప‌లు ఫిర్యాదులు అందిన‌ తర్వాత కొంత మంది ఐక్యరాజ్యసమితి ఉద్యోగులను తొలగించారని ఈ కొత్త డాక్యుమెంటరీ పేర్కొంది. సంస్థ "అవినీతితో నిండిపోయింది" అని యూఎన్ ఉద్యోగులే కొంద‌రు ఆరోపించడం సంచ‌ల‌నంగా మారింది.

ఈ డాక్యుమెంట‌రీ త‌ర్వాత UN సెక్రటరీ జనరల్, ఆంటోనియో గుటెర్రెస్, మహిళలపై లైంగిక హింస‌, అత్యాచార‌ ఆరోపణలను పరిశీలించడానికి ఒక నిష్పాక్షికమైన ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అయితే, అధికారికంగా ఏవైనా ఫిర్యాదులు దాఖలు చేస్తుంటే కొంద‌రు సీనియర్ ఉద్యోగులపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని, వాళ్లు రక్షించబడుతున్నారనే ఆరోప‌ణ‌ల‌ను కూడా పరిష్కరించాల‌ని, ఇలాంటి సంస్కృతిని ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఆయ‌న అభ్యర్థించారు.

BBC డాక్యుమెంటరీ 'ది విజిల్‌బ్లోయర్స్: ఇన్‌సైడ్ ది UN' అనే ఈ డాక్యుమెంట‌రీ లైంగిక వేధింపుల దావాలను అన్వేషిస్తుంది. ఇక ఈ డాక్యుమెంట‌రీలో పాల్గొని, వారి అభిప్రాయాల‌ను, ఆరోప‌ణ‌ల‌ను నివేదించడానికి ప్రయత్నించిన ఉద్యోగులపై వేధింపులు పెరుగుతున్నాయ‌ని, అయితే, వారిలో కొందరిని విడిచిపెట్టారని ఈ డాక్యుమెంట‌రీ సిరీస్‌లో పేర్కొన్నారు. ఇక‌, UN సెక్రటరీ జనరల్ కార్యాలయం ప్రకారం, "లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గుర్తించిన జూనియర్, సీనియర్ సిబ్బందిని క‌నుక్కోవ‌డం" ఇప్పటికీ అత్యంత ప్రాధాన్య‌మున్న అంశంగా మారింద‌ని తెలుస్తుంది.

Advertisement

Next Story