- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన యాంకర్.. ఆ ఫొటో షేర్ చేసి అందరికీ ధన్యవాదాలు చెప్తూ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తన అంద చందాలతో ఫిదా అనిపిస్తున్న యాంకర్ స్రవంతి చోక్కారపు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ చానల్స్‌లో హోస్ట్‌గా, ఇంటర్వ్యూలు చేస్తుంది. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమయ్యే పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలో అవకాశం దక్కించుకుంది. అలాగే బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి మరింత పాపులర్ అయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ప్రశాంత్ వర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందం ఈ బ్యూటీ సొంతం అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం ఆసుపత్రి బెడ్ పై దీనంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి.. తాను గడిచిన 40 రోజుల నుంచి విపరీతంగా బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటున్నానని.. ఎన్నో మెడిసిన్స్ వాడినా ప్రయోజనం లేకుండా పోయిందని.. ఆడవాళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆమె సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతూ తొందరగా కోలుకోవాలని మెసేజ్‌లు పెట్టారు. అయితే ఈ భామ ప్రస్తుతం తన అనారోగ్య సమస్యల నుంచి బయట పడినట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కాల్, మెసేజ్‌లు చేసిన వారందరికి ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అయింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ‘హమ్మయ్యా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మళ్లీ ఇలా చూడటం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.