క్యాన్సర్‌తో ఆ పార్ట్ కోల్పోయిన నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-10-14 14:35:42.0  )
క్యాన్సర్‌తో ఆ పార్ట్ కోల్పోయిన నటి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి హీనా ఖాన్(Hina Khan) గత కొద్ది కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్‌‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఆమెకు పలువురు సినీ సెలబ్రిటీలు అండగా నిలిచారు. అయితే హీనా ఖాన్‌కు కీమో థెరపీ కొనసాగుతున్నట్లు సమాచారం. నిత్యం ఆమె పలు పోస్టుల ద్వారా ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అవుతోంది. అయితే ఈ చికిత్స వల్ల ఈ మధ్య జుట్టును కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.

తాజాగా, కనురెప్పలు కోల్పోయినట్లు తెలుపుతూ హీనా ఖాన్(Hina Khan) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ట్రీట్‌మెంట్ ఫైనల్ స్టేజ్‌లో ఉండటంతో కనురెప్పలు పోయాయని ఫొటోలు షేర్ చేసింది. ‘‘ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒకప్పుడు నా కళ్లను అలంకరించిన శక్తివంతమైన, అందమైన బ్రిగేడ్‌ భాగం.

నా జన్యుపరంగా పొడవాటి అందమైన కనురెప్పలు.. చివరగా నిలబడి ఉన్న వెంట్రుకలు నా పక్కనే అన్నిటితో పోరాడాయి. నా కీమో చివరి స్టేజ్‌లో వాటిని కూడా కోల్పోయాను. అవును మేము ఇన్షా అల్లాహ్’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మీరొక వారియర్ తొందరలోనే కోలుకుంటారు అని ఆమెకు అండగా ఉంటున్నారు.

Advertisement

Next Story