బిగ్ బ్రేకింగ్ న్యూస్: పంజాబ్‌లో ఆప్ అఖండ విజయం

by GSrikanth |   ( Updated:2022-03-10 06:51:59.0  )
బిగ్ బ్రేకింగ్ న్యూస్: పంజాబ్‌లో ఆప్ అఖండ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో మరే పార్టీకి అందనంత ఎత్తులో 89 స్థానాలు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం అయ్యింది. అకాలీదళ్ 13, బీజేపీ 6 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ మరో రాష్ట్రంలో తన అధికారాన్ని విస్తరించింది. ఈ నేపథ్యంలో ఆప్ శిబిరంలో కోలాహలం నెలకొంది. సంగ్రూరులోని ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు అప్పుడే సంబురాలు జరుపుకుంటున్నారు. డప్పులు వాయిస్తూ వేడుక జరుపుకుంటున్నారు.

Advertisement

Next Story