Krithi Shetty: ఆ స్టార్ హీరో అర్ధరాత్రి ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నాడు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-26 14:29:25.0  )
Krithi Shetty: ఆ స్టార్ హీరో అర్ధరాత్రి ఫోన్లు చేసి టార్చర్ చేస్తున్నాడు.. యంగ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘ఉప్పెన’(Uppena) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) అందరికీ సుపరిచితమే. ఈ మూవీతో ఈ బ్యూటీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ స్టార్‌డమ్ అందుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక చివరిగా ‘కస్టడీ’(Custody), ‘మనమే’(Maname) వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలతో ఈ భామకు అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు కోలీవుడ్లో అవకాశం అందుకున్నట్లు వార్తలు రాగా.. మరొకవైపు మరో టాలీవుడ్ యంగ్ హీరోకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ ఎక్కువగా ఉందంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాను కూడా ఒక స్టార్ హీరో కారణంగా చిత్రవధకు.. గురి అవుతున్నాను అంటూ ఆమె బిగ్‌బాంగ్ పేల్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ.. “టాలీవుడ్‌లోని ఆ స్టార్ హీరో అర్థరాత్రి టైమ్‌లో ఫోన్ చేసి విసిగిస్తున్నారు. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పదేపదే చేస్తున్నాడు. ఇక అతడి నెంబర్ గుర్తుపట్టి లిఫ్ట్ చేయకపోవడం వల్ల వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు” అని కృతి శెట్టి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఆ హీరో పేరు మాత్రం రివీల్ చేయలేదు.

Advertisement

Next Story