- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'లోన్లీ ట్రీ' సంరక్షణకు థాయ్ పోరాటం!
దిశ, ఫీచర్స్ : థాయ్‌లాండ్, ట్రాట్ ప్రావిన్స్ తూర్పు తీరానికి కొద్ది దూరంలో 'కో ఖై హువా రోహ్' అనే ద్వీపం ఉంది. జనావాసాలు లేని ఈ ప్రాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఈ సాగర తీరం తబన్ చెట్టు(Xylocarpus rumphii)కు నిలయం కాగా.. నీలాల నీటి మధ్యన ఒంటరిగా ఉండే ఈ చెట్టు ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందాయి. దీంతో ఈ ద్వీపానికి పర్యాటకుల సందడి పెరిగింది. ఇక్కడ సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపిస్తున్న సందర్శకులు దానిపైకి ఎక్కడం వంటి చేష్టలతో వృక్షానికి ముప్పు ఏర్పడింది.
కోహ్ మాక్ టాంబోన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్.. ఆ ఒంటరి చెట్టును పరిశీలించేందుకు స్థానిక థాయ్ రిపోర్టర్ల బృందాన్ని 'కో ఖై హువా రోహ్'కు తీసుకెళ్లింది. కాగా ద్వీప ప్రాంతంతో పాటు చెట్టు కూడా పర్యాటకుల మూలంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సదరు బృందం గుర్తించింది. చిన్న చిన్న కొమ్మలు చాలావరకు విరిగిపోగా, చెట్టు వేళ్లను పదేపదే తొక్కడంతో డ్యామేజ్ అయినట్లు వారు పేర్కొన్నారు. కొనేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం చెట్టు ఎక్కువగా వంగినట్లు కనిపిస్తోందని వెల్లడించారు.
కో ఖై హువా రోహ్ ద్వీపం చాలా చిన్నది. ఒక్కసారికి కేవలం ఐదుగురు వ్యక్తులకు మాత్రమే వసతి కల్పిస్తుంది. కానీ స్థానిక అధికారుల నిర్ల్యక్షంతో కొన్నిసార్లు ఎక్కువ మంది పర్యాటకులను అనుమతిస్తుండటంతో పర్యాటకులు చెట్టును సంరక్షించాల్సింది పోయి దానిపై ఎక్కి, ఊగుతూ డ్యామేజ్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. దీంతో కో మాక్ టాంబోన్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్.. థాయిలాండ్‌లోని ఇలాంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్ ప్రదేశాలతో పాటు ఆయా ప్రాంతాల్లోని చెట్లను సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాలని యోచిస్తోంది. పర్యాటకుల సంఖ్యను పరిమితం చేయడం, ఏడాదిలో కొన్ని సీజన్‌లకు మాత్రమే అనుమతించాలని భావిస్తోంది. ఏదేమైనా ఇన్‌స్టాలో ఈ చెట్టు ప్రసిద్ధి చెందడానికి ముందు చాలా మెరుగైన ఆకృతిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు.