- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి డంపును స్వాధీనం చేసుకున్నారు.. అందులో ఏముందంటే..?
దిశ, ఏటూరునాగారం: మావోయిస్టు సభ్యులు భూమిలో పాతిపెట్టిన పేలుళ్ల సామగ్రిని తాడ్వాయి పోలీసులు గురువారం నిర్వీర్యం చేశారు. వివరాల్లోకి వెళితే.. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకుడైన బడే చొక్కారావ్ దామోదర్ ఆదేశాల మేరకు జేఎంఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వారైనా కంకణాల రాజిరెడ్డి వెంకన్న, కురసం మంగు భద్ర, ముంచంకి ఉంగల్ సుధాకర్ ల ఆధ్వర్యంలో ఏటూరునాగారం, మహదేవ్ పూర్ కమిటీకి చెందిన కోవాసి గంగ మహేష్, సోడి కొషి ఝాన్సీలు కలిసి కూంబింగ్ కి వచ్చే పోలీసులను హతమార్చే ఉద్దేశ్యంతో కుట్ర చేశారు.
తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో పేలుడు సామగ్రి దాచారన్న సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో పసర సర్కిల్ ఇన్ స్పెక్టర్, తాడ్వాయి సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు 39(బి) బీఎన్సీఆర్పీఎఫ్ అధికారులు ఉమ్మడిగా దొడ్ల ఏరియాలోని దట్టమైన అడవి ప్రాంతం చేరుకుని బాంబ్ డిస్ప్యూట్ టీమ్ తో కలిసి తనిఖీ చేస్తుండగా ఓ ప్రదేశం వద్ద వీరికి అనుమానం రావడంతో తవ్వగా ఓ నీలి రంగు డ్రమ్ము కనపడగా ఆ డ్రమ్ముని బాంబ్ డిస్ప్యూట్ టీమ్ సహాయంతో బయటకి తీసి పరిశీలించగా అందులో నాలుగు జిలేటెన్ స్టిక్స్, నాలుగు డితోనేటర్స్, ఒక లీడింగ్ వైర్ బెండల్, ప్లాస్టిక్ షీట్ లు ఆ డ్రమ్ములో లభ్యమయ్యాయి.
అనంతరం తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వరరావు సమక్షంలో లభ్యమైన వస్తువుల్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మావోయిస్టు వారు గతంలో అమర్చిన ల్యాండ్ మైన్స్ పేలి అమాయక ప్రజలు హతమయ్యారు. కావున ప్రజలు ఆయా ప్రాంతాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్త వహించాలని జిల్లా పోలీసులు ప్రజలకి సూచించారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అడవుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించే నిషేధిత మావోయిస్టు పార్టీ అమర్చే ల్యాండ్ మైన్స్ గుర్తించి వాటిని నిర్వీర్యం చేసి ప్రజలను ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ములుగు జిల్లా పోలీసులు తెలిపారు.