26/11 ప్రధాన సూత్రదారికి 31 ఏళ్ల జైలు శిక్ష

by Vinod kumar |
26/11 ప్రధాన సూత్రదారికి 31 ఏళ్ల జైలు శిక్ష
X

ఇస్లామాబాద్: 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ ఈ తోయిబా సహా వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్ సయ్యద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్ర నిరోధక కోర్టు రెండు నేరాల్లో సయ్యద్‌ను శుక్రవారం పాకిస్తాన్ కోర్టు దోషిగా తేల్చింది. శిక్షతో పాటు పాక్ కరెన్సీలో రూ.3,40,000 జరిమానా కూడా విధించింది. అంతకుముందు 2020లో సయ్యద్‌కు కోర్టు ఉగ్రసంస్థలకు ఆర్థిక సహాయం కేసులో జైలు శిక్ష విధించింది. ఐక్యరాజ్యసమితి సయ్యద్‌ను కరుడుగట్టిన ఉగ్రవాదిగా గుర్తించింది. గతంలో ఐదు కేసుల్లో సయ్యద్ పై 36 ఏళ్లు జైలు శిక్ష విధించింది.

దీంతో 70 ఏళ్ల ఈ ఉగ్రవాదికి పడ్డ జైలు శిక్ష 68 ఏళ్లకు పెరిగింది. అంతేకాకుండా ఆయనపై కోటి డాలర్ల బహుమానం ప్రకటించింది. అమెరికా కూడా సయ్యద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసింది. భారత్‌లో మారణహోమం సృష్టించిన 29/11 దాడుల వెనుకు సయ్యద్ ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గా ప్రకటించింది. 2008లో జరిగిన ఈ మారణకాండలో 10 మంది ఉగ్రవాదులు జలమార్గంలో భారత్‌కు వచ్చి, నాలుగురోజుల పాటు ముంబైలో హింసాకాండ సృష్టించారు. ఈ మారణకాండలో 160 మందికి పైగా మరణించగా, వందల సంఖ్యలో గాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed