- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా సంక్షేమం, హక్కుల కోసం ట్రెసా కృషి
దిశ, తెలంగాణ బ్యూరో : రెవెన్యూ శాఖలో పని ఒత్తిడిని తట్టుకొని ప్రజలకు ఎంతో మంది మహిళా ఉద్యోగులు నిరంతరం సేవలందిస్తున్నారని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్కొనియాడారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని కోరారు. ట్రెసా ఆధ్వర్యంలో మూసారాంబాగ్ రెవెన్యూ భవన్ లో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
మహిళా సంక్షేమం, హక్కుల కోసం ట్రెసా కృషి చేస్తుందన్నారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. పలువురు మహిళా తహశీల్దార్లను, రెవెన్యూ ఉద్యోగులను శాలువాలతో ట్రెసా కార్యవర్గ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్‌లతో పాటు ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కె. నాగమణి, మాధవి రెడ్డి, కార్యదర్శులు శ్రీదేవి, వాణి రెడ్డి, జాయింట్ సెక్రటరీలు బి.శైలజ, వాణి, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షులు ఎల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శుక్ల కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.సుధాకర్, వి.రామకృష్ణారెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, ట్రెసా కార్యవర్గ సభ్యులు అనితా రెడ్డి, గౌరీ వత్సల, విజయలక్ష్మి, రేణుక పాల్గొన్నారు.