- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డార్లింగ్‌కు హ్యాండిచ్చిన తెలుగు స్టార్ హీరోయిన్.. యంగ్ హీరోతో మ్యారేజ్‌కి రెడీ?
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కీ 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అలా ‘సలార్ 2’(Salar 2), ‘ఫౌజీ’(Fouji), ‘స్పిరిట్’(Spirit), ‘రాజా సాబ్’(Raja Saab), ‘కల్కీ 2’(Kalki 2) వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఈయన పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’(Adipurush) చేసిన సంగతి తెలిసిందే. ఓం రౌత్(Om Routh) తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ కృతిసనన్(Krithi Sanon) సీత పాత్రలో నటించింది. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం పొందింది. గ్రాఫిక్స్ చిన్న పిల్లల గ్రాఫిక్స్‌లా ఉన్నాయంటూ ఈ మూవీపై, దర్శకుడిపై సినీ ప్రియులంతా అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించే టైంలోనే ప్రభాస్, కృతి సనన్ ప్రేమ(Love)లో పడ్డారని, నిశ్చితార్థం కూడా జరిగిందంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.
దీంతో అవన్నీ పుకార్లే అంటూ కొట్టేశారు. ఇక ఆదిపురుష్ సినిమాతో పాటు బయట కూడా వారిద్దరి కెమిస్ట్రీ బాగుండటంతో అందరూ పెళ్లి చేసుకోబోతున్నారనే అభిప్రాయానికి వచ్చారు. అయితే అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని పరోక్షంగా ప్రభాస్ ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు. దీంతో డార్లింగ్ అభిమానులంతా నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ కృతి సనన్ మాత్రం ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan)తో డేటింగ్‌లో ఉందని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే కార్తీక్ ఆర్యన్, కృతి సనన్‌లు పెళ్లి(Marriage) చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.