- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana news:20 నిమిషాల ముందే సమాచారం అందినా.. ఘనంగా స్వాగతం పలికారు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. 'నేను తలచుకుంటే అసెంబ్లీ రద్దయ్యేది.' అని పరిధి దాటి వ్యాఖ్యలు చేశారని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్ రాంలాల్ కూలదోసిన తర్వాత ఎలాంటి ప్రజాగ్రహాన్ని చవిచూశారో మనందరికీ తెలిసిందేనన్నారు. గతంలో గవర్నర్‌గా ఉన్న నరసింహన్ గౌరవప్రదంగా వ్యవహరించారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన్ను అంతే గౌరవించిందని పేర్కొన్నారు. గవర్నర్ తమిళి సై తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ పాటించలేదని చెప్పడం అర్ధరహితమని, ఎక్కడ ఎవరు ఎలా అవమానించారో చెప్పాలన్నారు. యదాద్రి పర్యటనకు 20 నిమిషాల ముందే రాజ్ భవన్ నుంచి సమాచారం అందిందని, అయినప్పటికీ యాదగిరిగుట్ట చైర్మన్ గవర్నర్ తమిళిసైకి స్వాగతం పలికారన్నారు. గతంలో బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసై బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.