Covid : ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. ప్రజలు జర భద్రం

by samatah |   ( Updated:2022-04-18 05:37:05.0  )
Covid : ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. ప్రజలు జర భద్రం
X

దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్ ఫోర్త్ వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోతెలంగాణ వైద్యశాఖ అప్రమత్తం అయ్యింది. ఫోర్త్ వేవ్ తప్పదని వైద్య నిఫుణులు హెచ్చరికలు జారీ చేయడంతో, మాస్క్ నిబంధన మళ్లీ అమలు చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల క్రితం మాస్క్ మస్ట్ కాదు, కరోనా తగ్గు ముఖం పడుతుందని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం మానేశారు.

Advertisement

Next Story