- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యుత్ వినియోగంలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్..
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీంతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పీక్ డిమాండ్ నమోదైందని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ప్రకటించారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు, వేసవి వేడిమి నుంచి బయటపడేందుకు వినియోగిస్తున్న ఏసీలు, ఫ్యాక్టరీలతో విద్యుత్ వినియోగం రోజు రోజుకూ పెరిగి రికార్డు స్థాయిలో కరెంటుకు డిమాండ్ పెరిగినట్లు ప్రకటించారు.
ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అని స్పష్టం చేశారు. శనివారం ఒక్క రోజే ఏకంగా 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఏడాది 14,500మెగా వాట్స్ డిమాండ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లోనూ డిమాండ్ పెరిగిందని, గతేడాది 55మిలియన్ యూనిట్స్ ఉంటే ఈ సారి మార్చిలోనే 65మిలియన్ యూనిట్స్ డిమాండ్ పెరిగిందని సీఎండీ పేర్కొన్నారు.