నా మీద నాకు నమ్మకముంది: టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్

by Disha Desk |
నా మీద నాకు నమ్మకముంది: టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్
X

న్యూఢిల్లీ : టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తన ఫిట్నెస్‌పై వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. అలాంటి సమయంలోనే ప్రజలు విమర్శించడం మొదలెడతారు. నా మీద నాకు నమ్మకం ఉంది. మ్యాచులో ఎలా ఆడాలో నాకు ఒక విజన్ ఉంది. లెక్కలు నాకు ముఖ్యం కాదు. జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడమే నాకు ముఖ్యం.' అంటూ హర్మన్ ప్రీత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, గత కొంతకాలంగా వైస్ కెప్టెన్ ఫిట్నెస్‌పై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో హర్మన్ ప్రీత్ సెంచరీతో రెచ్చిపోవడంతో పాటు న్యూజిలాండ్‌తో జరిగిన ఐదవ వన్డేలో అర్ధ సెంచరీ చేసి విమర్శకులకు గట్టి సమాధానం చెప్పింది. ఇదిలా ఉండగా 2017లో ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచులో 171 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ ఇప్పటివరకు సెంచరీ సాధించలేదు.




Advertisement

Next Story

Most Viewed