- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీడీఆర్ బాండ్ల స్కాంలో టీడీపీ హస్తం.. మంత్రి బొత్స సత్యనారాయణ
దిశ, ఏపీ బ్యూరో : తణుకు టీడీఆర్ బాండ్ల అవినీతిలో వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రధాన ముద్దాయి అని టీడీపీ ఆరోపిస్తుంటే కాదు టీడీపీ సానుభూతిపరులే అవినీతికి పాల్పడ్డారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ టీడీఆర్ బాండ్లపై స్పందించారు. ఈ టీడీఆర్ బాండ్ల స్కాంలో టీడీపీ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై టీడీపీ ఆరోపణలు అర్ధరహితమంటూ కొట్టి పారేశారు. తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు అధికారులతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారని... ఈ అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.
ఈ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే పూర్తిస్థాయి విచారణకి కూడా ఆదేశించామని పేర్కొన్నారు. అసెంబ్లీలో టీడీపీ నేతలు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారంటూ మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అమలు చేసింది ఎన్టీఆర్ అయితే దానికి తూట్లు పొడిచింది చంద్రబాబు కాదా? అని సూటిగా ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని తాము చెబుతున్న విధంగానే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.