- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TATA Motors: 'నెక్సాన్' కొత్త వేరియంట్ కారును విడుదల చేసిన టాటా మోటార్స్!
న్యూఢిల్లీ: TATA Motors Launches New Nexon XM+(S) Variant In India| దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ కొత్త వేరియంట్‌ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 9.75 లక్షలు(ఎస్క్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ఈ కొత్త వేరియంట్ ఎక్స్ఎమ్ ప్లస్(ఎస్) ఇది వరకే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఎక్స్ఎమ్(ఎస్), ఎక్స్‌జెడ్ ప్లస్ ట్రిమ్‌లకు మధ్యన మిడ్-వేరియంట్‌గా అందుబాటులో ఉందని, దేశీయ వినియోగదారులకు అత్యాధునిక సౌకర్యాలు, ప్రయోజనాలతో దీన్ని తీసుకొచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఏసీ వెంట్, రెయిన్ సెన్సింగ్ వైపర్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు సహా ఇంకా పలు అత్యాధునిక ఫీచర్లు ఇందులో లభించనున్నాయి. భారత మార్కెట్లో నెక్సాన్‌కు అత్యంత ఆదరణ, గుర్తింపు ఉందని, వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన కారుగా నెక్సాన్ నిలిచిందని కంపెనీ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్-ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు.
ప్రస్తుతం కంపెనీ 3.5 లక్షల కంటే ఎక్కువ నెక్సాన్‌లను విక్రయించిందని, దేశీయ వాహన పరిశ్రమలో ఎస్‌యూవీ విభాగంలో మెరుగైన వాటాతో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Oppo India: రూ. 4,389 కోట్ల సుంకాలను ఎగ్గొట్టిన ఒప్పో ఇండియా!
- Tags
- TATA Motors