- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే 3-5 ఏళ్లు సీఎన్‌జీ, ఈవీలపైనే దృష్టి: టాటా మోటార్స్!
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 3-5 ఏళ్లలో దేశీయంగా సీఎన్‌జీ వాహనాల వాటా తమ మొత్తం కార్ల అమ్మకాల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది. ఇప్పటికే ఎంట్రీ లెవెల్ పెట్రోల్, డీజిల్ కార్లు కొనాలని భావిస్తున్న వినియోగదారులు సీఎన్‌జీ వైపు చూస్తున్నారని కంపెనీ అభిప్రాయపడింది. దీంతో పాటు రాబోయే కొన్నేళ్లలో కంపెనీ విక్రయించే మొత్తం వాహనాల్లో 20 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) ఉండనున్నాయని అంచనా వేస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ఔట్‌లెట్ల విస్తరణపై దృష్టి సారించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న డీజిల్ కార్ల అమ్మకాలు 15 శాతంగా ఉన్నాయని, పెట్రోల్ 66 శాతం, సీఎన్‌జీ వాహనాల అమ్మకాలు 12 శాతంగా ఉన్నాయి. రానున్న 3-5 ఏళ్లలో పెట్రోల్ వాహనాలు 50 శాతానికి తగ్గనున్నాయి. సీఎన్‌జీ వాహనాలు 20 శాతానికి పెరుగుతాయి. డీజిల్ వాహనాల అమ్మకాలు 10 శాతానికి క్షీణిస్తాయని, అలాగే, కంపెనీ ప్రధానంగా దృష్టి సారిస్తున్న ఈవీ అమ్మకాలు 20 శాతానికి చేరుకుంటాయనే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని శైలేష్ చంద్ర వివరించారు. అలాగే, సీఎన్‌జీ మోడళ్ల విస్తరణ కొసం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్ విభాగాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఎస్‌యూవీ విభాగంలో సీఎన్‌జీ మోడళ్లను తీసుకురావడం క్లిష్టంగా ఉండొచ్చని చంద్ర అభిప్రాయపడ్డారు.