ప్రీమియన్ హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్' మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్!

by Disha Desk |
ప్రీమియన్ హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన టాటా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఆల్ట్రోజ్ డీసీఏ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్టు బుధవారం ప్రకటించింది. ఈ వాహనం కోసం వినియోగదారులు కంపెనీకి చెందిన డీలర్‌షిప్‌ల వద్ద రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి నెల రెండో వారం నుంచి ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్‌లో ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లలో లభిస్తాయని కంపెనీ వివరించింది. 'ఇప్పటికే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో విజయవంతంగా అమ్ముడవుతున్న వాటికి తోడు కొత్తగా ఆల్ట్రోజ్ డీసీఏ మోడల్ తీసుకొచ్చాం. గ్లోబల్ స్థాయిలో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌ను వినియోగదారులకు అందించనున్నామని' టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్, మార్కెటింగ్ విభాగం వైస్-ప్రెసిడెంట్ రాజన్ అంబా అన్నారు.

Advertisement

Next Story