MK Stalin: ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్

by Nagaya |   ( Updated:2022-07-14 10:19:20.0  )
Tamil Nadu CM MK Stalin Hospitalised in Kauvery for Covid
X

దిశ, వెబ్‌డెస్క్ : Tamil Nadu CM MK Stalin Hospitalised in Kauvery for Covid| కరోనా బారిన పడ్డ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడగా అప్పటి నుండి ఆయన ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో చికిత్స తీసుకున్నారు. అయితే ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో గురువారం ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. తొలుత అలసట, జ్వరం వంటి స్వల్ప లక్షణాలు ఉండటంతో గత మంగళవారం కరోనా పరీక్ష చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని రావడంతో ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తాను కరోనా బారిన పడ్డానని.. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో స్టాలిన్ కరోనా లక్షణాలతో గురువారం ఆసుపత్రిలో చేరినట్లు కావేరి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి ప్రకటన చేయలేదు. స్టాలిన్ త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు కోరుకుంటున్నారు.

Also Read: పెట్రోల్, డీజిల్ ధర తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisement

Next Story

Most Viewed