'బ్లడీ బ్రిలియంట్'.. కంగన లుక్‌పై తమన్నా రియాక్షన్

by S Gopi |
బ్లడీ బ్రిలియంట్.. కంగన లుక్‌పై తమన్నా రియాక్షన్
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సహనటి కంగనా రనౌత్ నయా లుక్‌పై ప్రశంసలు కురిపించింది. కంగన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ'లో దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ గురువారం రిలీజ్ చేశారు మేకర్స్. కాగా కట్టు, జుట్టు, నడవడిక.. మొత్తం ఇందిరా గాంధీ మాదిరిగానే కనిపించడంతో పొగిడేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే ఈ లుక్ చూసి ఎగ్జయిట్ అయిన తమన్నా.. 'బ్లడీ బ్రిలియంట్' క్యాప్షన్‌తో నెట్టింట ప్రశంసలు కురిపించింది. ఇక భారతదేశంలో 1975-77 వరకు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Advertisement

Next Story

Most Viewed