Thaman : చరణ్ ఫ్యాన్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన తమన్..

by Prasanna |   ( Updated:2024-10-22 12:41:41.0  )
Thaman :  చరణ్ ఫ్యాన్ కి సూపర్ ఆఫర్ ఇచ్చిన తమన్..
X

దిశ, వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే గేమ్ ఛేంజర్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ మూవీ పై అంచనాలను పెంచుతూ థమన్ అప్డేట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ కి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉన్నారు.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేసారు. వాటిలో ‘రామచ్చా మచ్చా..’ అనే సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసిన ఈ పాటకి స్టెప్పులు వేసిన డాన్స్ వీడియోలు షేర్ చేస్తున్నారు. అయితే, తాజాగా తమన్ కూడా ఒక వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ఓ కుర్రాడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలోని రామచ్చా మచ్చా.. సాంగ్ కి డాన్స్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేసాడు.

థమన్ ఈ వీడియోపై రియాక్ట్ అవుతూ .. " ఆ అబ్బాయి డీటెయిల్స్ కనుక్కోండి రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ అబ్బాయితో డాన్స్ చేయిద్దాం" అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు. దీంతో ఆ అబ్బాయి జాక్ పాట్ కొట్టేసాడని, తమన్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story