ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే నేరం కాదు: లోక్‌సభలో నితిన్ గడ్కరీ వెల్లడి

by Disha Desk |
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే నేరం కాదు: లోక్‌సభలో నితిన్ గడ్కరీ వెల్లడి
X

న్యూఢిల్లీ: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటాన్ని త్వరలో చట్టబద్దం చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన లోక్‌సభలో చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే కొన్ని నిబంధనలు మాత్రం తప్పక పాటించాలని చెప్పారు. ఫోన్‌లో మాట్లాడుతున్నపుడు ఇయర్ ఫోన్స్ లేదా ఇతర డివైస్‌లు ధరించి ఉండాలని తెలిపారు. దీంతో పాటు ఫోన్ కారులో కాకుండా జేబులో ఉంచాలని చెప్పారు. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపేస్తే, మీరు దానిని కోర్టులో సవాల్ చేయవచ్చని అన్నారు. అయితే డ్రైవింగ్ సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడటం కూడా ప్రమాదమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed