Swiggy: ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్-ఫ్రమ్-ఎనీవేర్ విధానం ప్రకటించిన స్విగ్గీ!

by Harish |   ( Updated:2022-07-29 11:12:08.0  )
Swiggy to allow Work From Anywhere Policy
X

న్యూఢిల్లీ: Swiggy to allow 'Work From Anywhere Policy'| దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ 'ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ' విధానాన్ని పొడిగిస్తున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా సంస్థలోని కీలక విభాగాల్లోని ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్-ఫ్రమ్-ఎనీవేర్ వెసులుబాటు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ పని విధానం ప్రకారం, కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్ ఫంక్షన్, టెక్నాలజీ విభాగాల్లోని ఉద్యోగులు రీమోట్ విధానంలో పని చేస్తారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి బేస్ లొకేషన్‌లో ఉద్యోగులు సమావేశం అయ్యేలా కంపెనీ నిర్ణయించింది. కంపెనీలోని మేనేజర్లు, ఉద్యోగుల నుంచి వచ్చిన సూచనల మేరకు వర్క్-ఫ్రమ్-ఎనీవేర్ విధానం తీసుకొచ్చామని, గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనితీరు మెరుగుపడటం, పెరిగిన ఉత్పాదక ఆధారంగా ఉద్యోగులు హామీ ఇచ్చారని కంపెనీ వివరించింది.

ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ద్వారా ఫ్లెక్సిబిలిటీకి అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కొత్త పని విధానంతో మెరుగైన పనితీరు కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఉద్యోగులు, మేనేజర్లతో చర్చించిన తర్వాత శాశ్వతంగా వర్క్-ఫ్రమ్-ఎనీవేర్ అవకాశాన్ని తమ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రంగు మారిన స్ప్రైట్ బాటిల్‌.. దాని వెనుక ఓ ఆస‌క్తిక‌ర‌ కార‌ణం

Advertisement

Next Story

Most Viewed