- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరుతను ఢీకొన్న కారు.. ఊహించని ప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః మానవ తప్పిదాలకు ఓ వైపు అటవీ సంపదంతా నాశనమవుతుంటే, దీని కారణంగా జీవావరణం దెబ్బతిని కాలుష్యం పెరిగిపోతోంది. మరోవైపు, అటవీ సంరక్షణ కోసం అభయార్యణాలు నిర్వహిస్తున్నామంటూనే వ్యాపార ప్రయోజనాల కోసం అడవి మధ్యలో నుండి రోడ్లు వేయడం కూడా చూస్తూనే ఉన్నాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్యే వన్య మృగాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఓ చిరుతపులిని కారుతో ఢీకొట్టిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లుకొడుతోంది. కారు ఢీకొట్టడంతో చిరుత కారు ముందు భాగంలో అత్యంత ప్రమాదకరంగా ఇరుక్కుపోయింది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిరి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. మరో వీడియోలో చిరుత పరిస్థితిపై అప్‌డేట్‌ను కూడా పోస్ట్ చేశారు.
అయితే చిరుతపులి ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియోలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. ప్రభుత్వాలు, అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, వన్య ప్రాణులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అభయారణ్యాలను వ్యాపారాలకు వాడుకోవద్దంటూ సూచిస్తున్నారు. అడవి మార్గాలను మూసేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి పోస్ట్ చేసిన రెండు వీడియోల్లో ఒకటి కారు కింద చిక్కుకుపోయిన చిరుతను చూపిస్తే, మరొకటి ప్రమాదంలో తీవ్రమైన గాయాలతో బయటపడిన చిరుత రోడ్డుపై నుండి కిందికి దూకి పారిపోవడాన్ని చూపిస్తుంది. ఇక, ఐఎఫ్ఎస్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు, గాయపడిన చిరుతకు చికిత్స అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.