18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే

by Mahesh |
18 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన స్టార్స్.. ఫ్యాన్స్‌కు పండగే
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు బిగ్‌ అప్‌డేట్ ఇచ్చాడు. 18 ఏళ్ల తర్వాత స్టార్ డైరెక్టర్ బాల తో కలిసి పని చేయబోతున్న సూర్య.. తన 41వ చిత్ర షూటింగ్‌ను కన్యాకుమారిలో ఘనంగా ప్రారంభించినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌తో పాటు డైరెక్టర్‌తో దీర్ఘంగా చర్చిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'నా మెంటార్ బాల సార్ యాక్షన్ ఎప్పుడు చెబుతారా? అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా.

18 ఏళ్ల తర్వాత ఆ క్షణం వచ్చినందుకు సంతోషంగా ఉంది. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి' అంటూ రాసుకొచ్చాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'నందా', 'పితామగన్' భారీ విజయాలు సొంతం చేసుకోగా.. ప్రస్తుత మూవీ పై భారీ హైప్ నెలకొంది. కాగా ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక సమర్పణలో తమ సొంత నిర్మాణ సంస్థ '2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌' నిర్మిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed