Alzheimer : అద్భుతం.. ఈ పనులు రోజూ చేసేవారు అల్జీమర్స్ బారిన పడరు!

by Javid Pasha |
Alzheimer : అద్భుతం.. ఈ పనులు రోజూ చేసేవారు అల్జీమర్స్ బారిన పడరు!
X

దిశ, ఫీచర్స్ : అల్జీమర్స్.. ప్రపంచ వ్యాప్తంగా నడీడు దాటిన వారిని వేధిస్తున్న సమస్యల్లో ఇదొకటి. సాధారణంగా 65 ఏండ్లు దాటిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, జన్యుపరవమైన అంశాల కారణంగా నడీడు వయసులో, అంతకంటే తక్కువ ఏజ్‌లో కూడా మతిమరుపునకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే దీనికి మూలాలను గుర్తించి నివారించడం తప్ప ఇప్పటి వరకైతే సరైన చికిత్సా విధానం లేదని నిపుణులు చెబుతుంటారు. కాగా సాధారణ వ్యక్తులతో పోలిస్తే కొన్ని రకాల వృత్తుల్లో ఉన్నవారు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ వివరాలేమిటో చూద్దాం.

రీసెంట్‌గా ‘The BMJ’లో పబ్లిషైన స్టడీ ప్రకారం.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచుగా జర్నీ చేసే టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లు మతిమరుపు లేదా అల్జీమర్స్ బారిన పడే అవకాశం మిగతా వారికంటే చాలా తక్కువ. ఇది గుర్తించేందుకు అధ్యయనంలో భాగంగా పరిశోధకులు యూఎస్‌లోని 8 మిలియన్ల మందికి సంబంధించిన హెల్త్ అండ్ అల్జీమర్స్ డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు ఇతర వృత్తులతో పోలిస్తే టాక్సీ డ్రైవర్లు, అంబులెన్స్ డ్రవైర్లు తమ వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించడంతోపాటు ఇతర వృత్తులతో పోలిస్తే అల్జీమర్స్ వ్యాధితో మరణించే అవకాశం తక్కువగా ఉంటోందని గుర్తించారు.

తరచుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించడం, ఈ సందర్భంగా నావిగేషనల్ ప్రాసెసింగ్‌పై ఎక్కువగా ఫోకస్ చేయడం వంటివి టాక్సీ, అంబులెన్స్ డ్రైవర్లలో మతిమరుపు లేదా అల్జీమర్స్ వంటివి రాకుండా ప్రొటక్ట్ చేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల అయితే తమ స్టడీ ప్రకారం.. అల్జీమర్ మరణాల విషయానికి వస్తే టాక్సీ డ్రైవర్లలో 1.03% మంది మరణించారని, అంబులెన్స్ డ్రైవర్లలో ఈ డెత్ రేట్ 0.74% ఉందని పరిశోధకులు గుర్తించారు. కాగా మిగతా వృత్తుల్లో ఈ డెత్‌రేట్ శాతం ఎక్కువగా ఉంటోందని వారు కనుగొన్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పలు అధ్యయనాల నుంచి సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed